ఓట్లను తోలగించే స్కాంలో మంత్రి నారా లోకేష్ దే కీలక పాత్ర

0
106

ఏపీ రాజకీయాలను ఇప్పుడు ఐటీ గ్రిడ్ కుంభకోణం కుదిపేస్తోంది. ఈ సంస్థ సాయంతో ఏపీలో వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారన్న నిజం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం బయటపెట్టిన సామాజిక కార్యకర్త తుమ్మల లోకేష్ రెడ్డి… ఏపీ ప్రభుత్వం తమ ప్రజల వ్యక్తిగత వివరాలను ఎలా బహిర్గతం చేసిందో నిరూపించారు. నకిలీ ఓట్ల నమోదుతో పాటు వైసీపీ ఓట్లను ఎలా తీసేశారో క్లారిటీ ఇచ్చారు.  ఈ స్కాం వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరి వాదనలో నిజం ఎంత అన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. ఐటీ గ్రిడ్ స్థాపించిన దాకవరం అశోక మంత్రి లోకేష్ సన్నిహితుడు. నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన అశోక్ గతంలో… తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్ డిజైన్ చేశారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అశోక్… టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీర రవిచంద్ర సహకారంతో మంత్రి లోకేష్ సన్నిహితుడిగా మారారు. అశోక్ తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అల్లూరు సంర్పెచ్ అయ్యారు. అయితే బీద సోదరుల రాజకీయంతో ఆయన టీడీపీకి మారారు. ఐటీ రంగంలో మంచి ప్రావీణ్యం ఉన్న అశోక్… పదేళ్ల క్రితం హైదరాబాద్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు. పార్టీ అనలిస్ట్ అనే వెబ్ సైట్ ద్వారా ఏపీలో జరిగే రాజకీయ పరిణామాలను స్టడీ చేసేవాడు అశోక్.

ఈ విధంగా బీద సోదరులతో స్నేహం ఏర్పర్చుకున్న అశోక్… వారి ద్వారా మంత్రి లోకేష్ దగ్గర చేరారు. అప్పుడు ఈ కుట్రకు నాంది పలికిందని అర్థం అవుతోంది. ఎందుకంటే… ఈ స్కాం వెలుగులోకి రాగానే పరారైన దాకవరం అశోక్… విజయవాడలో తేలారు. అలాగే ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన సామాజిక కార్యకర్త లోకేష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. కానీ తెలంగాణ పోలీసులు వెంటనే మేల్కొనడంతో వారి ఎత్తుగడలు పారలేదు. దాదాపు 8 లక్షల 75 వేల ఓట్లను తొలగించిన అశోక్ అండ్ గ్యాంగ్… ఇప్పుడు ఈ స్కాం నుంచి ఎలా బయటపడాలో, తమ వెనుక ఉన్న పెద్దలు ఏ మేరకు సాయం చేస్తారో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు.