హైదరాబాద్ లో మోడీ పర్యటన

0
154
narendra modi visit hyderabad for telangana election campaign

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ సోమవారం నగరానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అధికారులు ఇప్పటికే సిటీకి చేరుకున్నారు.స్టేడియంను సైతం పరిశీలించిన బృందం పలు కీలక సూచనలు చేసింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఇవి అమలులో ఉంటాయని ఆదివారం కొత్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాహుల్ పర్యటన

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సోమవారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగే ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో రాత్రి 7 గంటలకు వెళ్లనున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీరామ్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగే కార్యక్రమాల్లో రాహుల్‌ పాల్గొంటారు.