నా కెరీర్ లైఫ్‌ కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది మీరే : నవీన్ చంద్ర

0
163
Aravinda sametha

అరవింద సమేత’ చిత్రం మంచి సక్సెస్‌ టాక్‌తో  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, జగపతి బాబు, నవీన్ చంద్రలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా చూసిన వారంతా ట్విటర్ ద్వారా ఈ ముగ్గురి నటనను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. నవీన్ చంద్రకైతే ఈ సినిమా ఓ బిగ్గెస్ట్ బ్రేక్. బాల్‌రెడ్డిగా నవీన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సందర్భంగా నవీన్ చంద్ర.. త్రివిక్రమ్‌కు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ పట్ల నా విధేయతను చూపేందుకు థాంక్యూ అనేది చాలా చిన్న విషయం. నా కెరీర్ లైఫ్‌కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది మీరే త్రివిక్రమ్ సార్. బాల్‌రెడ్డి అనే క్యారెక్టర్ నాకు మీరు ఇచ్చిన చాలా పెద్ద వరం. ప్రతి స్టెప్‌లో మీరిచ్చిన గైడెన్స్ నేనేంటో చూపించింది. మీరిచ్చిన సపోర్ట్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఎంచుకున్నందుకు థాంక్స్’’ అంటూ నవీన్ చంద్ర ట్వీట్ చేశారు.