సోనియా కీలక నిర్ణయం.. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ

navjot-singh-sidhu-appointed-punjab-congress-president

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది.  అలాగే మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొని ఉన్న సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ నిర్ణయం వెల్లడించారు.

వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్‌ సింగ్‌ గిల్జియాన్, సుఖ్వీందర్‌ సింగ్‌ డానీ, పవన్‌ గోయెల్, కుల్జీత్‌ సింగ్‌ నాగ్రాలను వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. కాగా గత కొద్ది రోజులుగా అమరీందర్‌ సింగ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.