ఆ వాయిస్ చంద్రబాబుదే : స్టీఫెన్ సన్ సంచలనం

Nominated MLA Stephenson confirmed Vote for Note audio tape

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ సమర్పించిన వీడియోలు, ఆడియోలు నిజమేనని నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కోర్టుకు తెలిపారు. ఏసీబీ సమర్పించిన ఆడియోలో గొంతు చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హాజరయ్యారు. సాక్షులుగా స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ వాంగ్మూలాలు నమోదు చేసిన ఏసీబి కోర్టు.. స్టీఫెన్ సన్ కుమార్తె వాంగ్మూలం నమోదు కోసం  ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 7కి వాయిదా వేసింది.