రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎవరెవరికెంత?

0
196
RRR Movie Updates

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘అరవింద సమేత’ రూపంలో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు .మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘రంగస్థలం’ అంటూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు . ఇక ‘బాహుబలి’ని రూపుదిద్దిన జక్కన్న గురించి చెప్పాల్సిన పనే లేదు. మరి ఈ ముగ్గురూ ఒక్కటైతే.. ఇంకేమన్నా ఉందా? ప్రభంజనమే! కలెక్షన్ల ప్రవాహమే!

ఎన్టీఆర్, చెర్రీ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ సినిమాపైనే ఇప్పుడు అందరి కళ్లు. ఎప్పుడైతే ఈ ముగ్గురి సినిమా అని ప్రకటించారో అప్పుడే మొదలయ్యాయి అంచనాలు, లెక్కలు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుండటంతో ఊహాగానాలకు రెక్కలు తొడిగారు. ఈ సినిమా కోసం చెర్రీ, తారక్‌లు 200 రోజులు కేటాయించారని, ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉండాలని జక్కన్న స్కెచ్ వేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

ఇక రెమ్మ్యూనరేషన్ సంగతులు వదులుతారా? అంతా.. ఇంతా అంటూ ఓ రేంజ్ లెక్కలు వేస్తున్నారు. అయితే దీనిపై ప్రస్తుతం వినిపిస్తున్న మాట మాత్రం.. ఎన్టీఆర్, చెర్రీ, జక్కన్న ఎవ్వరూ రెమ్మ్యూనరేషన్ తీసుకోవటం లేదని, లాభాల్లో వాటా మాత్రమే తీసుకోబోతున్నారని అంటున్నారు. అంతేకాదండోయ్.. ఇలా వాటా తీసుకుంటే చెర్రీ, తారక్‌లకు చెరో 50 కోట్లు వస్తాయని కూడా ఊహించేస్తున్నారు. చూడాలి మరి వీరి ఊహలు నిజమవుతాయా అనేది.