టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌ రెడ్డి

padi-kaushik-reddy-joins-trs-party-presence-cm-kcr

వారం కిందట కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హుజురాబాద్ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరారు.  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో ఆయనకు గులాబీ కండువా కప్పుకున్నారు. కౌశిక్‌ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 

కాంగ్రెస్‌ హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కౌశిక్‌ రెడ్డి  ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా మాట్లాడుతూ.. కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారు.. కౌశిక్ రెడ్డికి మంచి భవిశ్యత్ ఉంటుందని అన్నారు.