‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ : క్యూట్ లవ్ స్టొరీ

0
388
padi-padi-leche-manasu-movie-review

గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి లాంటి హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం పడిపడి లేచె మనసు. ఈ చిత్రానికి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్‌లను అందించిన హను రాఘవపుడి దర్శకుడు. ఫిదా, ఎంసీఏ లాంటి చిత్రాలతో నటించిన సాయిపల్లవి కథానాయిక. వీరిందరి కలయికలో రూపొందిన అందమైన ప్రేమకథ డిసెంబర్ 21 థియేటర్ లో హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు ఇవే..

పడి పడి లేచె మనసు’ ఫస్ట్‌లుక్‌లోనే శర్వానంద్, సాయి పల్లవి చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. అనంతరం విడుదలైన టీజర్‌లో రొమాంటిక్ ప్రేమజంటగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. హను రాఘవపూడి టేకింగ్‌కి తోడు విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ యూత్‌ని కట్టిపడేశాయి. ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ సాంగ్‌తో పాటు ‘పద పద’, ‘కల్లోలం’ సాంగ్స్ మళ్లీ మళ్లీ వినేలా చేశాయి.

డాక్టర్ గా సాయిపల్లవి

సాయిపల్లవి డాక్టర్ పాత్రలో ఇక సాయిపల్లవి నిజజీవితంలో పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో సాయిపల్లవి మెడికోగా కనిపించనున్నారు. అందం, అభినయం కలబోసిన పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నది. శర్వానంద్, సాయిపల్లవి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ అని చెప్పుకొంటున్నారు. ఇక సాయిపల్లవి మరోసారి డ్యాన్సులతో ఇరుగదీసిందనేది తాజా సమాచారం.

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా తెలుగు సినిమాల విజయాలకు సెంటిమెంట్‌గా మారిన కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా ఈ సినిమా రూపొందింది. కోల్‌కతాలోని కిక్కిరిసిన ప్రాంతాల్లో ఈ ప్రేమకథను హను రాఘవపుడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా శర్వానంద్ కనిపిస్తారు. సూర్యుడిలా ప్రకాశించేలా ఉండాలని ఈ పాత్రకు హను రాఘవపుడి పేరుపెట్టారట.