మహాకూటమి పై …అగ్రనేతల రహస్య సమావేశాలు..!!

0
119
Mahakutami meeting

మహాకూటమి పక్షాలు సీట్లసర్దుబాటుపై చర్చలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఒక దఫా సమావేశమైన మహాకూటమి పక్షాలు శనివారం ఉదయమే రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. గండిపేటకు సమీపంలోని ఓ హోటల్‌లో సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీడీపీ నుంచి ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి ఓ ముఖ్య నేత హాజరైనట్లు తెలుస్తోంది. 16 సీట్లను టీజేఎస్ కోరుతుండగా కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగు 6 సీట్లు కోరుతున్న సీపీఐకు మూడు స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించడంతో మరో మూడు స్థానాపలై ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు టీడీపీ 15 సీట్లు కోరుతుండగా 9 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఈ రహస్య సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకటిరెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై మహాకూటమి పక్షాలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.