పాక్ మాజీ అధ్యక్షుడి  పాస్‌పోర్టు రద్దు

0
229
musharraf pakistan
పాకిస్తాన్  మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డులను అధికారులు రద్దు చేశారు. దేశ ద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్‌ పాస్‌పోర్టు, గుర్తింపుకార్డులను రద్దు చేయాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఆయనపై ప్రస్తుతం ప్రయాణ నిషేధం ఉంది. ఆయన దుబాయిలో ఉండటం కూడా చట్ట విరుద్ధమంది కోర్టు. ఆయన ఇప్పుడు రాజకీయ ఆశ్రయం కోరవచ్చు లేదా పాక్ కు తిరిగి రావాలనుకుంటే అందుకు తగిన డాక్యుమెంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పిన‌ట్లు సమాచారం.
పాకిస్తాన్ లో 2007లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినందుకుగానూ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గృహనిర్బంధం చేసినందుకు, వంద మందికి పైగా జడ్జిలను తొలగించినందుకు ఆయన దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ముషారఫ్‌ 2016 మార్చి 18న వైద్య చికిత్స కోసం దుబాయికి వెళ్లారు. తర్వాత కొన్ని నెలలకు ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నేరస్థుడిగా ప్రకటించి ప్రయాణ నిషేధం విధించింది. కోర్టు ఈ ఏడాది మార్చిలో ముషారఫ్‌ కంప్యూటరైజ్డ్‌ నేషనల్‌ ఐడెంటిటీ కార్డును, పాస్‌పోర్టును రద్దు చేయాలని ఫెడరల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here