18 రోజుల విరామం తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol-diesel-petrol-reached-rs-101-in-madhya-pradesh-and-rajasthan

 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత, మంగళావారం పెట్రోల్,డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు..  లీటరుకు పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ 18 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 90.55 రూపాయలు, డీజిల్ లీటరుకు 80.91 రూపాయలకు చేరుకుంది. 18 రోజుల తరువాత, పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు వచ్చింది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పెట్రోల్ లీటరుకు 101 రూపాయలు దాటింది. ఈ సంవత్సరంలో ఆయిల్ ధరలు  జనవరిలో 10 రెట్లు, ఫిబ్రవరిలో 16 రెట్లు పెరిగాయి, మేలో మొదటిసారిగా ఈరోజే  పెరిగాయి.  మార్చిలో 3 సార్లు, ఏప్రిల్‌లో 1 సార్లు మాత్రమే తగ్గాయి. 

రెండు నెలలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గత నెలలో ముడి చమురు ధరలు పెరిగినా కూడా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచలేదు. అయితే, ముడి చమురు రేటు తగ్గడంతో.. పెట్రోల్,డీజిల్ ధరలను నాలుగు విడతలుగా తగ్గించారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెరగడం ప్రారంభించాయి.