రజినీకాంత్ పెట్ట సాంగ్స్ డిసెంబర్ 9న

0
216
petta movie audio released on dec 9th

సరికొత్త ట్యూన్స్‌తో తమిళ ఇండస్ట్రీని డ్యాన్స్‌ చేయిస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్‌. సినిమాలోని పాటలను తనదైన మేనరిజమ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లే హీరో రజనీకాంత్‌. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పెట్ట’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్‌ 9న విడుదల కానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్‌ కానుంది. ‘‘పెట్ట ఆల్బమ్‌తో తలైవరిజమ్‌  చూపిస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే   రజనీకాంత్‌ ఆరోగ్యం బాగాలేక చెన్నెలోని హాస్పిటల్లో జాయిన్‌ అయ్యారని కోలీవుడ్‌లో ఓ వార్త షికారు చేసింది. అయితే రజనీకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

rajinikanth petta movie