బెంగాల్ లో హింస.. 11 మంది మృతి

pm-modi-expresses-concern-over-violence-murder-and-arson-calls-governor-dhankad

మే 2 న పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తరువాత ఉద్రిక్తత వాతావరణం కోనసాగుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ టిఎంసి భారీ విజయం సాధించిన తరువాత.. బిజెపి  అధికార పార్టీ కార్యకర్తల మధ్య ప్రతీకార రాజకీయాల నెత్తుటి ఆట ప్రారంభమైంది. ఇప్పటివరకు 6 జిల్లాలలో హింసకు సంబంధించిన నివేదికలు వచ్చాయి..

హింస కారణంగా  రెండు రోజుల్లో సుమారు 11 మంది మరణించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ జగదీష్ ధన్‌ఖర్‌ను ఫోనులో సంప్రదించి బెంగాల్‌లో కాల్పులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో అనాగరిక హింస, కాల్పులు, దోపిడీలు, హత్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని గవర్నర్ మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం చాలా ముఖ్యమని తెలిపారు.