తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

pm-narendra-modi-phone-calls-telugu-states-cms-covid-situations

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలపై సీఎంలను మోదీ అడిగి తెలుసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై సీఎం జగన్‌ ప్రధానికి వివరించారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై కూడా ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ అనంతరం ఒడిశా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రుల్రతో కూడా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.