దీపావళి వేడుకల్లో ట్రంప్

0
221
trump in diwali celebrations

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్‌ రూమ్‌లో జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్‌తో పాటు భారత రాయబారి నవతేజ్ సింగ్‌ సర్నా, ఆయన భార్య అవినా, పలువురు ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. యూఎస్‌ భారత్‌తో ధృడమైన సంబంధాలు కలిగి ఉందని అన్నారు.

                                                       Donald Trump Celebrates Diwali in Oval Office

అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు, జైనులకు దీపావళి అతిపెద్ద పండుగని ఆయన అన్నారు. కోట్లాది మంది తమ కుటుంబాలతో కలిసి వారి జీవితాల్లో కాంతులు నిండాలని కోరుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో కూడా ట్రంప్‌ పాల్గొన్నారు.