కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీ విలీనం

punjab-ekta-party-announces-merger-with-congress-ahead-of-assembly-polls

పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఐడి) కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మిత్రపక్షం పంజాబ్ ఏక్తా పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో విలీనం అయింది. ఆ పార్టీ సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, జగదేవ్ సింగ్, పిర్మల్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి విలీనంపై చర్చించారు. 

పంజాబ్ ఏక్తా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్ ఉన్నారు. మాజీ కాంగ్రెస్ సభ్యుడు ఖైరా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి 2015 డిసెంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నియంత అని ఆరోపిస్తూ ఆయన జూన్ 4న కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చారు. ఆ పంజాబ్ ఏక్తా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారు  శిరోమణి అకాలీదళ్ కు దగ్గరగా ఉన్నారు. తాజాగా పంజాబ్ ఏక్తా పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన‌ట్లు ప్రకటించారు.