ఖేల్ రత్న అవార్డుకు అశ్విన్, మిథాలీరాజ్ పేర్ల సిఫారసు

R Ashwin, Mithali Raj nominated for Khel Ratna; Shikhar, KL Rahul and Jasprit Bumrah for Arjuna award

ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డుకు భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పేర్లను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) సిఫారసు చేసింది. అర్జున అవార్డుకు శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రాలను బోర్డు సిఫార్సు చేసింది.

రాబోయే జాతీయ క్రీడా పురస్కారాలు 2021 కోసం దరఖాస్తు సమర్పించే చివరి తేదీని పొడిగించాలని యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ముందే నిర్ణయించింది. నామినేషన్లు సమర్పించడానికి మునుపటి తేదీ జూన్ 21 కాగా తాజాగా దాన్ని పొడిగించారు.

ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు గత సంవత్సరం ఐదుగురు భారతీయ క్రీడాకారులకు లభించింది. మణికా బాత్రా, రోహిత్ శర్మ, వినేష్ ఫోగట్, రాణి రాంపాల్, మరియప్పన్ ఫంగవేలు కు గత ఏడాది ఖేల్ ప్రదానం చేశారు. భారత క్రీడా చరిత్రలో తొలిసారిగా ఐదుగురు భారతీయ అథ్లెట్లకు ఒకే సంవత్సరంలో ఖేల్ రత్న లభించడం విశేషం.