లారెన్స్‌ సినిమాలో శ్రీరెడ్డి……అడ్వాన్స్‌ తిత్లి తుఫాన్ బాధితులకు విరాళం..!!

0
252
srireddy new movie

తమిళ కథానాయకుడు రాఘవా లారెన్స్ కొత్త సినిమాకు టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సంతకం చేశారు. ఈ సినిమాలో తను కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్‌ను శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

‘నా స్నేహితులకు శుభవార్త. లారెన్స్‌ గారిని ఆయన ఇంట్లో కలిశా. చాలా బాగా ఆహ్వానం పలికారు. అక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు. వాళ్లు లారెన్స్‌తో చాలా సంతోషంగా ఉండటం గమనించా. నేను ఆడిషన్స్‌ ఇచ్చాను. లారెన్స్‌ తన తర్వాతి సినిమా కోసం నన్ను తీసుకున్నారు. కచ్చితంగా మంచి పాత్ర ఇస్తానని ప్రామిస్‌ చేశారు, అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. దీన్ని శ్రీకాకుళం తూఫాన్ బాధితులకు విరాళంగా ఇస్తాను’ అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. అక్కడే నివసిస్తున్నట్లు ఆమె ఇటీవల సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం శ్రీరెడ్డి చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.