రెండో రోజు రాహుల్ గాంధీ షెడ్యూల్

0
144
rahul gandhi 2nd day schedule in telangana

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు జిల్లాలో తమ అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేయనున్నారు. భూపాలపల్లి, ఆర్మూర్, పరిగి, చేవెళ్ల బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాసేపట్లో శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో రాహుల్‌ భేటీ అవుతారు. మధ్యాహ్నం 1:15 గంటలకు భూపాలపల్లిలో బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు పరిగి, 6 గంటలకు చేవెళ్లలో రాహుల్‌ ప్రసంగించనున్నారు.