తారక్, చెర్రీ ల కోసం ‘బిగ్‌బాస్’ హౌస్‌..!!

0
147
RRR team in Bigg Boss

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌లతో ‘RRR’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ నెల 11న లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే తారక్, చెర్రీల కోసం రాజమౌళి.. బిగ్‌బాస్ హౌస్‌ను నిర్మించినట్టు తెలుస్తోంది. అలాగే తారక్, చెర్రీలు ఈ చిత్రం షూటింగ్‌ని ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని రాజమౌళిని కోరినట్టు తెలుస్తోంది. రాజమౌళి కూడా సమయాన్ని వృథా చేయాలని అనుకోవడం లేదట. కాబట్టి తారక్, చెర్రీలను తాను నిర్మించిన బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండాలని కోరారట. డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూ.300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా… ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.