ఓ పవర్ ఫుల్ రాజకీయ వేత్త పాత్రలో పవన్ కల్యాణ్..!!

0
152
Ram Talluri planning moovie with Pawan Kalyan

పవన్ కల్యాణ్ దృష్టంతా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనే నిలిచింది. ఇక సినిమాల్లో నటిస్తాడా అనే ప్రశ్నలకు రకరకాల సమాధానం వస్తున్నాయి. కానీ పవర్‌స్టార్ మాత్రం సినిమాలపై పెదవి విప్పడం లేదు. కానీ మీడియాలో మాత్రం పవన్ సినిమాపై తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది. కొందరు నిర్మాతలు కూడా పవన్ సినిమా చేయడం గ్యారంటీ అని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ పవన్ చేసే సినిమా ఏంటీ?  వివరాల్లోకి వెళితే.. ఆయన త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని, ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. పవన్‌ కోసం నిర్మాత రామ్‌ తాళ్లూరి ఓ కథ సిద్ధం చేయిస్తున్నారట. బాబీ, డాలీలలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇందులో పవన్‌ తో పాటు మరో మెగా కథా నాయకుడు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ల్లో ఒకరు పవన్‌తో పాటు తెరపై కనిపించే అవకాశాలున్నాయట. పవన్‌ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుందని, కథకు ఆయన పాత్రే కీలకమని సమాచారం. ఈ కథలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తారట.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ రాజకీయ వేత్త పాత్రలో కనిపిస్తారట.