‘రంగు’ మూవీ రివ్యూ

0
258

టైటిల్ :  రంగు
తారాగణం : తనీష్‌‌, ప్రియా సింగ్‌, పరుచూరి రవి, షఫీ, పోసాని కృష్ణమురళి,
పరుచూరి వెంకటేశ్వర్రావు తదితరులు
సంగీతం :  యోగేశ్వర్‌ శర్మ
దర్శకత్వం : కార్తికేయ
నిర్మాత : పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు
రేటింగ్ : 2/5

బాలనటుడిగా సక్సెస్‌ అయిన తనీష్‌.. హీరోగా సక్సెస్‌ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. తనీష్‌ తెరపై హీరోగా కనపడి చాలా కాలమే అయింది. ఇటీవలె బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన తనీష్‌.. విజయవాడ రౌడీ షీటర్‌ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రంగు చిత్రం.. తనీష్‌ను హీరోగా నిలబెట్టిందా?.. అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది చూద్దాం..

ఓ వ్యక్తి రౌడీగా మారడానికి దారితీసే కారణాలు.. ఆవేశంలో చేసే పనులు.. ఆలోచన లేకుండా భవిష్యత్తును నాశనం చేసుకోవడం, తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలనుకోవడం అయినా గతం వెంటాడటం లాంటి సంఘటనల్లో సినిమా కావాల్సినంత కమర్షియల్ కంటెంట్‌ ఉంది. కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా.. వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఈ కథకు పరుచూరి బ్రదర్స్‌ మాటలు రాయడం ప్లస్‌ పాయింట్‌. వారి మాటలు మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్‌ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
కథ
కొన్ని పాత్రలు
హీరో

మైనస్‌ పాయింట్స్‌ ;
నిర్మాణ విలువలు
సినిమా నిడివి
కథనం