‘అమర్, అక్బర్, ఆంటొని’ టీజర్ వచ్చేసిందోచ్..!!

0
134
Amar akbar Antony

మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్, అక్బర్, ఆంటొని’. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. 56 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్.. ‘‘మనకు నిజమైన ఆపదొచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’’. అనే డైలాగ్ తో ప్రారంభమై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ సరసన ఇలియానా ఆడిపాడుతోంది. చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని నవంబర్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవివశంకర్, మోహన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.