జే.సీ.దివాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు పై చేసిన కామెంట్ల వెనుక ఇదే రీజన్

0
172

అనంత‌పురం ఎంపీ జే.సీ.దివాక‌ర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీద చేసిన కామెంట్ల వెనుక చాలా రీజ‌నింగ్ ఉంది. జే.సీ. ఏదో నోటి దురుసుతోనే, అన్యాప‌దేశంగానో ఆ మాట‌లు అన‌లేదు. ఈ ఎన్నిక‌లు జే.సీ. దివాక‌ర్ రెడ్డికి స‌వాల్ కానున్నాయి. ముఖ్యంగా ఆయ‌న అనంత‌పురం ఎంపీ సీటు నుంచి ఈసారి గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌ని అర్థం అవుతోంది. ఎందుకంటే… అనంత‌పురం పార్ల‌మెంట్ సీటు ప‌రిదిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అనంత‌పురం అర్బ‌న్, రాయ‌దుర్గం, ఉర‌వ‌కొండ‌, గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి, శింగ‌న‌మ‌ల‌, క‌ల్యాణదుర్గం సీట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ సిట్టింగ్ స్తానాల్లో ఉన్న ఏ ఒక్క ఎంఎల్ఏ దివాక‌ర్ రెడ్డికి ఈసారి స‌హ‌క‌రించే ప‌రిస్తితిలో లేరు. ముఖ్యంగా అనంత‌పురం అర్బ‌న్ ఎంఎల్ఏ ప్ర‌భాక‌ర్ చౌద‌రి వీరిలో ముందుంటారు. మిగిలిన వారు, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన స్తానాల్లో ఇప్పుడు టీడీపీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారు జే.సీ.ని ఓ బూచిలా చూస్తున్నారు. దీనికి కార‌ణం ఒక్క‌టే. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గానికి చెందిన వ్య‌క్తితో గ్రూపులు క‌ట్టించారు దివాక‌ర్ రెడ్డి. ఇప్పుడు వీరికే టిక్కెట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వీరైతేనే త‌న‌కు పార్ల‌మెంట్ స్తానంలో గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని జే.సీ.కి బాగా తెల్సు. ఒక‌వేళ తాను కాకుండా త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డిని నిల‌బెట్టినా ప‌రిస్తితి ఇలాగే ఉంటుంది. అందుకే దివాక‌ర్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నారు.

అంతేకాదు…  త‌న వ‌ర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిద్ధంగా లేర‌ని దివాక‌ర్ రెడ్డికి బాగా తెల్సు. అందుకే త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు సీట్ల‌తో పాటు మ‌రో 33 సీట్లు క‌లిపి 40 సీట్ల‌లో కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌క‌టించారు జే.సీ. దివాక‌ర్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో కొవ్వూరు, నిడ‌ద‌వోలు త‌దిత‌ర ప్రాంతాల్లో సిట్టింగుల మీద తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న దివాక‌ర్ రెడ్డి… ఈ విధంగా చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టే విధంగా మాట్లాడారు. తాను చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వ‌క‌పోతే అనంత‌పురం జిల్లాలో టీడీపీ మ‌టాష్ అన్న రీతిలో ఆయ‌న మాట్లాడారు. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే… జ‌గ‌న్ హ‌వాలో టీడీపీ గెల‌వ‌ద‌ని దివాక‌ర్ రెడ్డికి బాగా తెల్సు. అందుకే చంద్ర‌బాబు తీరు మీద త‌న‌కు కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని చెప్పారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఏ మేర‌కు గెలుస్తుందో జే.సీ. దివాక‌ర్ రెడ్డి మాట‌లతోనే అర్థం అవుతోంది.

Also Read:మరోసారి నోరు జారేసిన టీడీపీ ఎంపీ జే.సీ. దివాకర్ రెడ్డి