శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కులు రాక

rising-flood-krishna

కర్ణాటకతోపాటు కృష్ణా పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.  బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది.