ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

road-accident-bus-and-truck-accident-barabanki-uttar-pradesh

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకి జిల్లాలో 50 మంది కార్మికులు, బస్సు ముందు రోడ్డుపై నిద్రిస్తున్నారు. బారాబంకిలో ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో18 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులంతా బిహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.