రోబో ‘2.0’ మూవీ రివ్యూ

0
421

టైటిల్‌ : 2.ఓ
జానర్‌సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం : రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌ తదితరులు
సంగీతంఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : శంకర్‌
నిర్మాతసుభాస్కరణ్‌
రేటింగ్ : 3/5

rajinikanth and akshay kumar

భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మాంత్రికుడు శంకర్ రూపొందించిన మూవీ ‘2.O’. రజినీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

స్టొరీ 

హఠాత్తుగా నగరంలోని సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్స్‌ అన్ని కలిసి ఓ సెల్‌ ఫోన్‌ వ్యాపారిని, ఓ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఓనర్‌ని దారుణంగా హత్య చేస్తాయి.డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి, మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. ఈ ప్రయత్నంలో వసీకరణ్‌ విజయం సాధించాడా..? అన్నది తెరపై చూడాల్సిందే.

rajinikanth in robo 2.0 movie

నటీనటులు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్‌ వసీకరణ్‌, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది. ముఖ్యంగా 2.ఓ గా రజనీ మేనరిజమ్స్‌కు థియేటర్‌లో విజిల్స్‌ పడతాయి. ఓ సాధారణ ప్రోఫెసర్‌ సమాజాన్ని పక్షి జాతిని కాపాడేందుకు పడే వేదనను ఆయన అద్భుతంగా పలికించారు. యాక్షన్‌ సీన్స్‌లోనూ అలరిం‍చింది.

amy jackson in robo 2.0 movie

ప్లస్‌ పాయింట్స్‌ :
గ్రాఫిక్స్‌
రజనీ, అక్షయ్‌ల నటన
మ్యూజిక్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్ ప్లే