‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్స్‌పై రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్..!!

0
188
RRR Movie Rolling photos

దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించనున్నారు అని తెలిసిందే . ఎప్పుడైతే ఒకే ఫ్రేమ్‌లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ దర్శనమిచ్చారో.. అప్పుడే మొదలైంది అందరిలో ఆసక్తి. ఈ ముగ్గురూ కలిసి సినిమా చేస్తున్నారనే వార్త రావటంతో ఆ ఆసక్తి కాస్త ఆతృతగా మారి షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా ఈ ముగ్గురినీ సెట్స్ పైన చూసే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు మొదలయ్యాయి. తాజాగా వారి కోరక మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్స్‌పై తనతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి దిగిన పిక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు జక్కన్న. ఈ రోజే ‘ఆర్‌ఆర్‌ఆర్’ రోలింగ్ ప్రారంభమైంది అని ట్యాగ్ చేశారు.  ప్రస్తుతం ఈ పిక్ ట్విట్టర్ లో  చకెర్లు కొడుతుంది.