సాక‌ర్ 2018ః ర‌ష్యా మొద‌టి విక్ట‌రీని సాధించింది

1
155
fifa russia first match win
కోట్లాది మంది క్రీడాభిమానుల కనుల పండుగ సాకర్ ప్రపంచకప్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రష్యా ఆతిధ్యమిస్తున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ వేడుకలు లుజ్నికి స్టేడియంలో అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రారంభోత్సవంలో బ్రిటన్ పాప్ సింగర్ రాబీ విలయమ్‌సన్, రష్యన్ కళాకారిణి ఐదా గారిపుల్‌నియా ప్రదర్శన వీక్షకులను ఊర్రూతలూగించాయి. తొలిరోజు ఆతిధ్య జట్టు రష్యా, సౌదీ అరేబియా తలపడ్డాయి. అద్భుతమైన ప్రదర్శనతో రష్యా ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి విక్ట‌రీని సాధించింది. రష్యా ఆటగాళ్లు ఆదినుంచి దూకుడుగా ఆడుతూ సౌదీని 5-0 తేడాతో చిత్తుగా ఓడించారు. ఆట ప్రారంభమైన 13వ నిమిషంలో రష్యన్ ప్లేయర్ యూరీ గజిన్‌స్కీ హెడర్ గోల్ చేసి ఫిఫా 2018 వరల్డ్ కప్‌లో తొలి గోల్‌ను నమోదు చేశాడు. 43వ నిమిషయంలో రష్యాకే చెందిన డెనిస్ చెరిసేవ్ రెండవ గోల్ చేశాడు. ఇద్దరు సౌదీ అరేబియా డిఫెండర్స్‌ను దాటుకొని బంతిని టాప్ కార్నర్ నుంచి గోల్‌పోస్ట్‌కు తరలించాడు. మొదటి 45 నిమిషాల సమయానికి రష్యా 2-0తో అధిక్యంలో కొనసాగింది. త‌ర్వాత సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆర్టిమ్ డజిబా మరో గోల్ చేసి రష్యాకు 3-0 ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. ఈ గోల్ సాధించినందుకుగాను రష్యన్ కోచ్ డజిబాకు గౌరవ సెల్యూట్ చేశాడు. సెకండ్‌హాఫ్‌లో రష్యాకు అదనపు సమయం లభించింది. దీంతో మరో రెండు గోల్స్‌ను రష్యా ఆటగాళ్లు నమోదు చేశాడు. ఆట మొత్తం మీద అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన తీరుతో రష్యా తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. చెవిటి పిల్లి అచిల్లీన్ చెప్పినట్లుగానే విజయం రష్యాను వరించింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here