Salaar Review :
చిత్రం: సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్;
నటీనటులు : ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్,శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి తదితరులు; సంగీతం : రవి బస్రూర్ ; , సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, నిర్మాత విజయ్ కిరంగదూర్, రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల:22-12-2023
పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)… దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం ‘సలార్’, ‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ చిత్రాలతో వీళ్లు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఎప్పట్నుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అత్రుతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ సలార్ ఫీవర్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఎలాంటి వేడుకలు జరపకపోయినా భారీ సందడి మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ కటౌట్కు తగిన హిట్ పడిందా?
కథేంటంటే: ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజ మన్నార్ (జగపతిబాబు). ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చూడాలనేది తన కోరికగా చెబుతాడు రాజమన్నార్. కొన్నాళ్లు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు ఖాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని వరద రాజమన్నార్ని అంతం చేయడం వరకూ వెళుతుందీ వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? అతనికి సలార్ (Salur Review in telugu) అనే పేరెలా వచ్చింది? 25 ఏళ్లపాటు ఊళ్లు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల పల్లెలో తలదాచుకోవల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాసన్) ఎలా వచ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ప్రభాస్… ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులన్నీ
ఈ సినిమాలో ఉన్నాయి. ‘కె.జి.యఫ్’ వరుస సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు ప్రశాంత్. కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని, పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్ తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఈసారి కూడా అదే తరహాలో ఖాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు. (Salaar Review in telugu) కె.జి.యఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథని నడిపించాడు. అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడంతా మంచి ఎలివేషన్లతో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించారు. సెకండ్ హాఫ్ లో కాస్త గందరగోళంగా అనిపించినా, సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చిన విషయం. చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్నా…. స్నేహం, అధికార కాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది.
చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు… ఇదే కథని వెయ్యేళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల్ని. కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళుతుంది చిత్రం. ప్రథమార్థం, ద్వితీయార్ధంలోనూ చాలా సేపటివరకూ హీరోయిజం కనిపించదు. ఫస్టాప్ ఈశ్వరీరావు, సెకండాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెనుదిరిగి చూడడు ప్రభాస్, ఒక్కసారిగా హీరోయిజం టాప్డేర్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. (Salaar Review in telugu) ఎలివేషన్స్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్. అక్కడ మంచి భావోద్వేగాలు పండాయి. ద్వితీయార్ధంలో అసలు కథ ఉన్నప్పటికీ… కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరసలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. (Salaar Review in telugu) అయితే పతాక సన్నివేశాల్లో మలుపు రక్తి కట్టిస్తుంది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగం సలార్పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. శౌర్యాంగ పర్వంగా ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎవరెలా చేశారంటే: ప్రభాస్ (Prabhas) కటౌట్ని పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్నీల్ చేరతారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగా తెరపై కనిపించారు. ఆయన కత్తి పట్టి ఎంత మందిని నరుకుతున్నా నమ్మేలా ఉందంటే కారణం ఆ కటౌట్, తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. (Salaar Review in telugu) పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం. స్టైల్ ఆకట్టుకుంటుంది. బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాల్ని అంతే అవలీలగా చేశారు ప్రభాస్, శ్రుతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ… ప్రథమార్ధంలో ఆమె కీలకం. పృద్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్కి, ఆయనకీ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహా, జగపతిబాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా: అవలీలగా చేశారు ప్రభాస్, శ్రుతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ… ప్రథమార్ధంలో ఆమె కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్కీ, ఆయనకీ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహా, జగపతిబాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఖాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. అన్బరివ్ స్టంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. (Salaar Review in telugu) ఓ మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతని ప్రదర్శించాడు ప్రశాంత్. ద్వితీయార్ధంలో సరళంగా కథని చెప్పలేకపోయారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొచ్చినా… ద్వితీయార్థం కొద్దివరకు డ్రామాని పండించడంలోనూ, ప్రభాస్ కి తగ్గట్టుగా మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించడంలోనూ ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
• బలాలు
• + ఖాన్సార్ చుట్టూ సాగే కద
• + ప్రభాస్,. పృద్వీరాజ్ పాత్రలు, నటన
• + బావోద్వేగాలు, డ్రామా, క్లైమాక్స్
• బలహీనతలు
– సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగోలేవు.
• చివరిగా.. సలార్: సీజ్పైర్, యాక్షన్ డ్రామా ఆదిరింది. అసలు కథ పార్ట్-2లో ఉంటుంది.