సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Sangam Dairy affair AP government spotted by highcourt

సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. డెయిరీని ప్రభుత్వాధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అలాగే డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తప్పనిసరి అని తీర్పు చెప్పింది. కాగా సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో టిడిపి సీనియర్ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి.. ఆ తరువాత  సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ధూళిపాళ్ల నరేంద్ర యాజమాన్యాన్ని రద్దు చేసి.. గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కు యాజమాన్య బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ఈ నిర్ణయాన్ని ధూళిపాళ్ల నరేంద్ర సహా కొంతమంది డైరెక్టర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ధూళిపాళ్ళకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది.