సీనియర్ నటి జయంతి కన్నుమూత

senior-actress-jayanthi-passes-away

సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో నటించారు  జయంతి.