తమిళనాడులో ‘గజ’ తూఫాన్…..ఏడుగురి మృతి..!!

0
240
Gaya Cyclone

తమిళనాడు రాష్ట్రాన్ని ‘గజ తూఫాన్‘ అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నాగపట్నం-వేదారణ్యం మధ్య ఇది తీరం దాటిన సమయంలో బలమైన ఈదురుగాలులతో తీర ప్రాంతాలు వణికిపోయాయి. 110 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. వేల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరపరా నిలిపిపోయింది. దీంతో చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తీరం దాటిన తూఫాన్ పశ్చిమ దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.

Gaya Cyclone తంజావూరు జిల్లా అధిరామ్‌పట్నంలో అత్యధికంగా 16సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరుచ్చిలోనూ భారీ వర్షం కురుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని బీచ్‌ల వద్ద ప్రవేశాన్ని నిషేధించారు. నాగపట్నంలో నాలుగు, కడలూరు జిల్లాలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యలు చేపట్టాయి. రహదారులపై పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను సహాయ సిబ్బంది ఎప్పటికప్పడు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తున్నారు.