లైంగిక వేధింపులపై చిన్మయి ట్విట్టర్‌లో ఆవేదన..!!

0
169
chinmayi sripada
ప్రముఖ దక్షిణాది నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది. ట్విట్టర్‌ వేదికగా ఆమె విడుదల చేసిన సందేశాలు ప్రస్తుతం తమిళ సినిమాలో కలకలం రేపుతున్నాయి. ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలు పెరుగుతుండడంతో లైంగిక వేధింపుల గురించి మాట్లాడేందుకు సెలబ్రిటీలు వరుసగా ముందుకొస్తున్నారు.
 ఈ నేపథ్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి చిన్మయి తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
8-9 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఒక రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లానని, అక్కడ తను నిద్రపోతున్నప్పుడు ఎవరో తడుముతున్నట్టు గుర్తించానని, ఆ విషయాన్ని అమ్మతో కూడా చెప్పానని పేర్కొంది. అలాగే 10-11 ఏళ్ల వయస్సప్పుడు డిసెంబర్‌ సంగీత కచేరీ చూస్తుండగా ఒక ముసలాయన తన తొడపై గిల్లాడని వెల్లడించింది. డార్లింగ్‌, స్వీట్‌హార్ట్‌ అంటూ పిలవడంతో అతన్ని దూరంగా పెట్టానని, అయితే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడని చిన్మయి ఆ సందేశాల్లో పేర్కొంది.