వాళ్ల తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా : షారుఖ్ ఖాన్

Shah Rukh khan

మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఎంతో సునాయాసంగా విజయం సాధించాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్.. నిరాశజనకంగా ఆడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కోల్ కతా ఘోర పరాజయం పై తాము తీవ్ర నిరాశ చెందినట్లు క్రికెట్ అభిమానులు నెటింట్లో స్పందిస్తుండగా.. కోల్ కతా ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ స్పందించారు. 

ట్విట్టర్ ద్వారా కోల్ కతా పరాజయంపై షారుక్ కామెంట్ చేశారు. "నిరాశాజనకమైన ఆటతీరు. అందరు అభిమానులను జట్టు తరఫున క్షమాపణలు కోరుతున్నా" అని ట్వీట్ చేశారు. 15వ ఓవర్ వరకూ ఆటను తమ నియంత్రణలోనే ఉంచుకున్న కేకేఆర్ టీమ్.. ఆ తర్వాత పట్టుకోల్పోయింది. జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ ల విజృంభణతో కకావికలై, చాలినన్ని పరుగులు సాధించలేకపోయింది. 6 బంతుల్లో 15 పరుగులు తీయలేక ఘోర పరాజయం పాలైంది.