పొర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌

shilpa-shetty-husband-raj-kundra-arrested-by-mumbai-police-for-making-adult-films

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్‌ చేశారు.  రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు చేసి మొబైల్ అనువర్తనాల ద్వారా షేర్ చేసేవాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు ఉన్నాయని.. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.  ముంబై పోలీసులు కమిషనర్ వెల్లడించారు.. నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.