టీఆర్‌ఎస్‌కు సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రాజీనామా..!

0
154
Sirpur MLA Kaveti Sammaiah

సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురువారం కాగజ్‌నగర్‌ సభకు హాజరయ్యారని, ఆ సభకు తనను పిలవలేదని, కనీసం తన పేరు కూడా ప్రస్తావించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత కాలంగా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాజీనామా పత్రాన్ని  పంపించినట్లు చెప్పారు. సమ్మయ్య రాజీనామాకు దారితీసిన పరిస్థితులు చెబుతుండగానే ఆయన సతీమణి, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సాయిలీల కంటతడి పెట్టారు. తమకు అన్యాయం చేసిన పార్టీని ఓడించి తీరుతామని సవాల్ చేశారు.