డేటా దోంగలించింది తెలంగాణ ప్రభుత్వమే అన్న శివాజీ

0
327

రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు నటుడు శివాజీ. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టారు. దీని మీద కూడా అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీని వదిలేసిన శివాజీ… గరుడు పురాణం పేరుతో జనంలోకి వచ్చారు. ఆ తర్వాత విశాఖలో జగన్ మీద దాడి జరగడం… అది కూడా శివాజీ చెప్పిట్లుగా ఉందని ఏకంగా సీఎం చంద్రబాబు అనడం… అప్పట్లో ఆ ఎపిసోడ్ ను పండించింది. ఎన్నికల వేళ ఏపీలో ఏం జరుగుతుందో కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనలు శివాజీ చెప్పినట్లే జరిగాయి. అయితే డేటా చోరీ అంశంలో ఎందుకో శివాజీ జ్యోతిష్యం చెప్పలేక పోయారు. కాకపోతే ఐటీ గ్రిడ్ రచ్చ అయిన తర్వాత మాత్రం… మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొనే ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు శివాజీ మీదున్న ప్రధాన ఆరోపణ.

డేటా చోరీలో ఎవరు దొంగలో ఇంకా పోలీసులు తేల్చక ముందే, శివాజీ తేల్చేశారు. తాను తెలుగుదేశం పార్టీ వాడిన కాదంటూనే… చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు శివాజీ. మరో విషయం ఏంటంటే… ఓట్ల తొలగింపు పేరుతో ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంతో చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కూడా శివాజీ ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఆయనో విషయాన్ని మర్చిపోతున్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది వైసీపీ అయితే… దానిపై ఎదురు దాడి చేస్తూ విషయాన్ని రచ్చ చేసింది టీడీపీ. ఈ పాయింట్ తెలీయకుండా శివాజీ మాట్లాడారంటే… ఆ విషయాన్ని ఏపీ జనం నమ్మేటట్లు లేదు. డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్న శివాజీ… కేసీఆర్ ను చూసి ఎందుకు భయపడాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూను చంపేశారని కూడా ఆరోపించారు శివాజీ. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలని కూడా శివాజీ అన్నారు. ఈ మాటలు కూడా చాలా కామెడీగా ఉన్నాయి. ఎందుకంటే… ఐటీ గ్రిడ్ అనేది హైదరాబాద్ కంపెనీ. దాంతో టైఅప్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక తనను చూసి భయపడాలని ఏనాడూ కేసీఆర్ చెప్పలేదు. ఇప్పుడు శివాజీ మాటలతో హైదరాబాద్ లోని ఏపీ జనం లేనిపోని భయాలు పెట్టుకోవాల్సి వస్తోంది.

ఇక హైదరాబాద్ బ్రాండ్ వేల్యా చంపేశారని చెబుతున్నారు శివాజీ. ఇంతకీ హైదరాబాద్ బ్రాండ్ వేల్యూ అంటే ఏంటి. అది తెచ్చింది ఎవరు. ఇప్పుడు పోగొట్టింది ఎవరు. అంటే శివాజీ కేసీఆర్ మీద ఆరోపణ చేశారా. ఇది కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఇక హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని శివాజీ చెప్పారు. ఈ విషయం తెలియకుండానే ఏపీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతి వెళ్లిపోయారా. ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు ఏపీ ప్రజలు. అంటే వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత శివాజీ మీదే ఉంది.