రేపటినుంచి ఏపీలో కుంభవృష్టి!

southwest-monsoon-reaches-andhra-pradesh-heavy-rains-ap

రాగాల రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. దీని ప్రభావంతో  రేపటి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, 

మయన్మార్‌ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుందని పేర్కొంది.దీని ప్రభావంతో  విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.