తాతయ్య ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ ఆశీస్సులతోనే ప్రజాసేవకు ముందడుగు వేశాను..!!

0
167
nandamuri suhasini, balakrishna

దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ప్రజా సేవ కోసం వస్తున్న తనను తెలంగాణ ఆడపడుచులంత ఆశీర్వదించాలని కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థిగా కోరారు. తాతయ్య ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ, మామయ్య చంద్రబాబు ఆశీస్సులతోనే ప్రజాసేవకు ముందడుగు వేశానని ఆమె పేర్కొన్నారు. సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా  శనివారం  ఉదయం 11:21 గంటలకు ముసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బాబాయి బాలకృష్ణ, పార్టీ నేత పెద్దిరెడ్డితో కలిసి  ఆమె నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.మా సోదరులు కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ నాకు అండగా ఉంటారు అని భావిస్తున్నాను. అంతకుముందు ఆమె బాలకృష్ణ, రామకృష్ణ, ఇతర నందమూరి కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులర్పించారు.