హైప్ కోసం లేనిది ఉన్నట్టు చెప్పిన బాబు గారి కార్యాలయ సిబ్బంది

0
336

డేటా చోరీ కేసులో తమ దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయంటూ చంద్రబాబు కార్యాలయం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంకేముంది… మీడియా దాని మీద హడావుడి చేసింది. కొద్ది సేపట్లో తన దగ్గరున్న ఆధారాలతో చంద్రబాబు, వైసీపీ నేతల తాట తీస్తారని ప్రసారం చేసింది. కానీ అంతలోనే… ఆ వార్తను ఠక్కున మీడియా ఆపేసింది. ఎందుకంటే… చంద్రబాబు ఆఫీసు నుంచి మరో వార్త లీక్ అయిందట. అదేమంటే… తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవనీ… కేవలం హైప్ కోసమే చిన్నపాటి డ్రామా ఆడినట్లు బాబు గారి కార్యాలయ సిబ్బంది చెప్పారట. దీంతో కంగుతినడం మీడియా వంతైంది. ఓవైపు తెలంగాణ పోలీసులు డేటా చోరీ కేసులో స్పీడుగా దర్యాప్తు చేస్తుంటే… దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, ఇలాంటి లీకులు ఇస్తున్నట్లు ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్న మాట.  మొత్తానికి జనాన్ని బురిడీ కొట్టించాలన్న టీడీపీ యత్నం ఈ విధంగా బెడిసికొట్టిందని అమరావతి వర్గాలు నవ్వుకుంటున్నాయి.