తెలంగాణ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

0
182
congress 3rd mla list

13 మంది అభ్యర్థులతో తెలంగాణ కాంగ్రెస్‌ మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. ఆయన జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అభ్యర్థుల వివరాలు..

భోథ్‌(ఎస్టీ)- సోయం బాపురావు

నిజామాబాద్‌ అర్బన్‌-తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌

నిజామాబాద్‌ రూరల్‌ – డా. రేకుల భూపతి రెడ్డి

బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్‌

ఎల్బీనగర్‌ -డి. సుధీర్‌రెడ్డి

కార్వాన్‌-ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజారి

యాకత్‌పురా- కె. రాజేందర్‌ రాజు

బహదూర్‌పుర – కలేం బాబా

కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌రెడ్డి

దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్‌

తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌

జనగామ – పొన్నాల లక్ష్మయ్య

ఇల్లందు(ఎస్టీ)- బానోత్‌ హరిప్రియ నాయక్‌