మెట్రో రైల్ కొత్త రూట్ అమీర్‌పేట – ఎల్‌బీనగర్‌

0
180
metro rail from ameerpet to lb nagar

రాజధాని భాగ్యనగరానికి మణిహారంలాంటి మెట్రోరైలు వ్యవస్థలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. మెట్రో మలి దశ ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది. అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో రైలుని ఈ నెల 24న గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.15 గం.లకు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో ఆయన మెట్రోరైలుకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ విషయాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విట్‌ ద్వారా తెలియజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ మార్గాన్ని ప్రారంభించాలనేది మంత్రి కేటీఆర్‌ ఆలోచన. జూన్‌లో ట్రయల్‌ రన్‌ పరిశీలన సందర్భంగా ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ప్రకటించారు కూడా. జులై ఆఖరు లేదా ఆగస్టులో ప్రారంభోత్సవం ఉంటుందని ఆనాడు చెప్పారు. అయితే అనుమతుల్లో జాప్యం జరిగింది. తీరా అనుమతులు వచ్చే సమయానికి రాష్ట్రంలో అపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ప్రారంభోత్సవాన్ని గవర్నర్‌ చేతుల మీదుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Metro Rail Route List