ర‌సాబాస‌గా ముగిసిన హెచ్సీఏ మీటింగ్.. అజారుద్దీన్, విజయానంద్ మధ్య వాగ్వివాదం

ర‌స‌భస‌గా ముగిసిన హెచ్ సీఏ మీటింగ్.. అజారుద్దీన్, విజయానంద్ మధ్య వాగ్వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య ముగిసింది. ఈ స‌మావేశంలో అపెక్స్ కౌన్సిల్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కానీ స‌మావేశంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.  వేదిక పైనే అజారుద్దీన్, విజయానంద్ మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా, ఈ సమావేశంలో అంబుడ్స్‌మెన్‌గా జస్టీస్ దీపక్ వర్మను నియమించారు. అయితే అంబుడ్స్‌మెన్ నియామకం విషయంలోనే  అజారుద్దీన్, విజయనంద్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  

స‌మావేశ అనంత‌రం హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ మాట్లాడుతూ..  జరిగిన పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో క్రికెట్  అభివృద్ధికి 20 శాతం ఫండ్ కేటాయించామని, క్రికెట్ అభివృద్ధే తన ధ్యేయం అని స్పష్టం చేశారు.  పాండిచేరి, ఆంధ్రప్రదేశ్‌లో లాగా.. తెలంగాణలోని అన్ని జిల్లాలలో గ్రౌండ్‌లని ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు స్వలాభం కోసం, ప్ర‌తి విష‌యంలో అడ్డుపడుతున్నార‌నీ ఆక్షేపించారు. హెచ్‌సీఏలో వివాదాలపై ఇప్ప‌టికే బీసీసీఐ సీరియస్‌గా ఉందని తెలిపారు. ఏజీఎంలో వివాదం సృష్టించిన వారికి షోకాజ్ నోటీస్‌లు ఇవ్వడంతో పాటు అవసరమైతే సస్పెండ్ చేస్తామని అజారుద్దీన్‌ ప్రకటించారు.