టెన్నిస్‌ దిగ్గజం షిర్లీ ఇర్విన్‌ కన్నుమూత

tennis-hall-famer-shirley-fry-irvin-passes-away-94

మహిళల సింగిల్స్‌లో మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత షిర్లీ జూన్‌ ఇర్విన్‌ కన్నుమూసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.. 1951లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన ఆమె...1956లో వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌తో పాటు తర్వాతి ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచింది. మహిళల టెన్నిస్‌లో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన పది మందిలో షిర్లీ కూడా ఒకరు. డబుల్స్‌లోనూ 13 గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ఆమెకు 1970లో టెన్నిస్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది.