తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించం : సీఎం కేసీఆర్‌

there-is-no-lockdown-in-telangana-says-cm-kcr

తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే జనజీవనం స్తంభించడం తోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముందని అన్నారు. కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే ఉద్ద్యేశంతో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

అయితే కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను మైక్రో లెవల్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి కరోనా నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. మే 15 తర్వాత కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు.