కోదండరాం రామగుండం నుంచి పోటి చేస్తున్నాడ?

0
154
kodandaram can be contest from ramagundam?

మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్‌ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది.

తమకు చెన్నూరు, ఆసిఫాబాద్, దుబ్బాక, షాద్‌నగర్‌ లేదా మెదక్‌ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. మరోవైపు చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి నియోజకవర్గాలు తాము కోరుకోవడం లేదని, ఆ సీట్లను కూడా మార్చాలని టీజేఎస్‌ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏదైనా నియోజకవర్గాన్ని మార్చి మహబూబ్‌నగర్‌ను ఇవ్వాలని వారు అడుగుతున్నట్లు సమాచారం. మరో రెండు సీట్లను పెంచడానికి కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగానే ఉందని, అదే సమయంలో సీట్లను కూడా మార్చాలని తాము కోరుతున్నట్లు టీజేఎస్‌ నేతలు చెబుతున్నారు.