టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ క‌న్నుమూత‌

Tollywood Singer anandh died

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది, వందలాది మందిని బలితీసుకుంటుంది. కొద్దిరోజులుగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడి మరణిస్తున్నారు.. తాజాగా సీనియ‌ర్ గాయ‌కుడు జి.ఆనంద్(67) క‌రోనాతో క‌న్నుమూశారు. అయితే కొద్దిరోజుల కిందట మహమ్మారి బారిన పడిన ఆయనను ఓ ఆసుపత్రిలో చేర్చగా  స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఆనంద్ మరణించినట్టు స‌మాచారం.

శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామానికి చెందిన ఆనంద్.. 40 ఏళ్లుగా సినీ రగంలో కొన‌సాగుతూ వ‌స్తున్న ఆనంద్ స్వర మాధురి’ కార్యక్రమం ద్వారా ప్రపంచమంతటా 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లో అయితే ‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి పాటలను పాడారు. సీరియ‌ల్స్‌కు, అనువాద చిత్రాల‌కు సంగీత కూడా అందించారు. ఆనంద్ మృతి పట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేశారు.