వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌..!

0
172
TRS-Working-President-KTR

తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న ఆలోచనతో కేసీఆర్‌.. కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు సమాచారం.కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు ట్విట్టర్‌లోనూ పార్టీ నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. కేటీఆర్‌కు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్పందించి కేటీఆర్ థ్యాంక్స్ బావ అంటూ రిప్లై ఇచ్చారు.

 


ఇప్పటి వరకు తెరాసలో కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిలో ఎవరూ లేరు. ఈ నియామకంతో తెరాసలో నూతన అధ్యయానికి కేసీఆర్ తెరదీశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశ్యంతోనే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారని తెలుస్తోంది.

అసదుద్దీన్ శుభాకాంక్షలు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడైన వ్యక్తికే తాను పార్టీ పగ్గాలు అప్పగించానని కేసీఆర్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నియామకంపై అసదుద్దీన్ స్పందిస్తూ… కొత్త బాధ్యతలు అందుకున్న కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ… కేసీఆర్ తన కుమారుడికి చాలా బరువైన బాధ్యతను అప్పగించారని, ఈ బాధ్యతలను కేటీఆర్ సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.