యాంకర్‌ ప్రదీప్‌ ఇంట విషాదం

tv-anchor-pradeep-machiraju-father-pandu-ranga-passed-away

ప్రముఖ టెలివిజన్ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ ఇంట  విషాదం నెలకొంది. ఆయన  తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  శనివారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో ప్రదీప్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరో వైపు ప్రదీప్ కు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. కాగా టెలివిజన్ పై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకను సంపాదించుకున్న ప్రదీప్‌.. ఇటీవల హీరోగా కూడా మారాడు. ఆయన హీరోగా నటించిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మం‍చి వసూళ్లను రాబట్టడం తోపాటు ప్రదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.